శోభన్ బాబుకి రూ. 3,000 కోట్లు ఇచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకో తెలిస్తే షాక్..!

lakhmi saranya
జయలలిత.. ఈ పేరు ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ నాలుగైదు దశాబ్దాల కిందట జయలలిత ఒక సంచలనం. అగ్ర హీరోలు సైతం ఆమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే పక్కకు తప్పుకునే సత్తా కలిగినది ఈ హీరోయిన్. జయలలిత డేట్స్ కోసం పడుగ‌పులు కాసేవారు. అంతలాగా అప్పట్లో ఈమె క్రేజ్ ఉండేది. ఇక సినిమా వస్తుందంటే జనాలు అప్పట్లో ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ సినిమాను వీక్షించేవారు. 1965 వ సంవత్సరంలో వచ్చిన మనుషులు మమతలు చిత్రంతో తెలుగు చిత్ర ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ఈ మూవీలో సావిత్రి మెయిన్ హీరోయిన్ గా నటించినది. ఇందిరా అనే రోల్ లో సెకండ్ హీరోయిన్ గా చేసింది జయలలిత. తొలి సినిమాతోనే తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తరువాత తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మరియు మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటించి మెప్పించింది. ఇక టాలీవుడ్ హీరో శోభన్ బాబు తో జయలలిత మంచి ఫ్రెండ్షిప్ ని ఏర్పరచుకుంది. అలా ఒక సందర్భంలో ఎంజీఆర్ స్విస్ బ్యాంక్ లో దాచి పెట్టుకున్నా మూడు వేల కోట్ల రూపాయలను ప్రేమతో జయలలిత శోభన్ బాబుకు ఇచ్చిందట.
ఎంజీఆర్ ఎప్పుడూ ధరించే టోపీ లో స్విస్ బ్యాంకుకు సంబంధించిన లెక్కలు ఉండేవట. ఇక ఒకసారి అది చూసిన జయలలిత దీనికి పెద్ద ప్రాసెస్ ఉందని తెలుసుకుంది. ఈ డబ్బులు నాకెందుకు నాకు బోల్డంతా ఉంది. నువ్వు తీసేసుకో అని శోభన్ బాబుకు ఇచ్చిందట. అయితే శోభన్ బాబు ఆ డబ్బు మొత్తం దుబారా ఖర్చు చేయకుండా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసి భూములు కొనుగోలు చేశాడట. అంతేకాకుండా అందులో సగం శోభన్ బాబు తీసుకుని మరో సగం జయలలిత కు ఇచ్చాడట. శోభన్ బాబుకు అప్పట్లోనే డబ్బులను ఎలా సేవ్ చేయాలి అనే వాటిపై మంచి అవగాహన ఉంది. ఇందువల్లే 300 కోట్లను దుబారా ఖర్చులకు వాడకుండా భూములపై ఇన్వెస్ట్ చేసి ఆస్తిపరుడు అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: