ఆ విషయంలో "సలార్" దరిదాపుల్లోకి కూడా రాకపోలేకపోయిన "కల్కి"..!

MADDIBOINA AJAY KUMAR
ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమా జూన్ 27 వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. దానితో ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను కూడా ఇప్పటికే ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ మూవీ యూనిట్ రెండు ట్రైలర్లను విడుదల చేసింది.

ఈ రెండు ట్రైలర్లకు కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ ప్రభాస్ ఆఖరుగా నటించిన సలార్ సినిమా ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ కు కల్కి సినిమా ట్రైలర్లకు వచ్చిన రెస్పాన్స్ కు ఎక్కడ పోలిక లేకుండా పోయింది. ప్రభాస్ ఆఖరుగా నటించిన సలార్ మొదటి భాగం సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా నుండి చిత్త బృందం విడుదల చేసిన ట్రైలర్ కు 24 గంటల సమయం ముగిసే సరికి 32.58 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

ఇలా ఈ సినిమా యొక్క ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇక కల్కి మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మొదటగా విడుదల చేసిన ట్రైలర్ కు 24 గంటల సమయం ముగిసే సరికి 14.43 మిలియన్ వ్యూస్ దక్కగా , ఈ సినిమా నుండి మూవీ బృందం విడుదల చేసిన రెండవ ట్రైలర్ కి విడుదల అయిన 24 గంటల్లో 12.03 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ సినిమాలోని రెండు ట్రైలర్లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కిన సలార్ సినిమా ట్రైలర్ కు దక్కిన రెస్పాన్స్ మాత్రం ఈ మూవీ ట్రైలర్లకు దక్కలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: