50 రోజుల రన్ తరువాత బ్యాన్ చేసిన బాలయ్య మూవీ.. రెండుసార్లు విడుదల.. రెండుసార్లు నిషేధం.. కారణమేంటి..!

lakhmi saranya
నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలకి ప్రేక్షకుల్లో ఏ విధమైన హైబ్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. మొన్నటి వరకు ఏపీ రాజకీయాల్లో చురుగ్గా సందడి చేసిన ఈయన వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో తన కెరీర్ 109వ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవల ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇక టైటిల్ ఫిక్స్ కాకపోయినప్పటికీ ఈ మూవీ కోసం అభిమానులు అండ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే బాలకృష్ణ సినిమా ఒకటి నిషేధానికి గురైంది.
అదికూడా థియేటర్లలో 50 రోజుల పాటు సందడి చేసిన అనంతరం. రెండు నెలల పాటు బ్యాంకు గురైన బాలకృష్ణ మూవీ మరేదో కాదు ఆయన నటించిన మొదటి సినిమానే. ఆ మూవీ పేరే తాతమ్మ కల. నందమూరి తారక రామారావు నట వారసుడిగా బాలయ్య బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్లు అవుతుంది. బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సినిమా తాతమ్మ కాల. తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు నందమూరి హరికృష్ణ కూడా నటించారు. బాలయ్యకు నటనపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా ఈ సినిమా లో క్యారెక్టర్ క్రియేట్ చేశారు సీనియర్ ఎన్టీఆర్. 1974 ఆగస్టు 29న విడుదలైన ఈ చిత్రంలో తాతమ్మగా భానుమతి నటించారు.
ఇక ఈ చిత్రంలో వివాదాస్పద అంశాలు అండ్ అభ్యంతరకర సన్నివేశాలు ఉండడం వల్ల సెన్సార్ సమస్యలు వచ్చాయి. సెన్సార్ సూచనలతో సినిమా సీన్లను మార్చా. అయితే సెన్సార్ పూర్తయి విడుదలైన అన్ని కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న అనంతరం ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని బ్యాంక్ చేయడం జరిగింది. కుటుంబ నియంత్రణ కోసం ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్న రోజుల్లో ఈ సినిమా విడుదలైంది. ఇక బ్యాన్ అయిన అనంతరం ఈ సినిమాలో మార్పులు చేశారు. రెండు నెలల నిషాదం తరువాత దినపత్రిక లో తాతమ్మ కల 50వ రోజు ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటనలో తమ సినిమాను మరొక విధంగా రూపొందించినట్లు అందుకే చిత్ర ప్రదర్శన పిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని మార్పులు చేసి 1975 జనవరి 8న మళ్లీ ఈ సినిమాను విడుదల చేశారు. అలా రెండుసార్లు ఈ సినిమా రిలీజ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: