సేమ్ - సేమ్ బట్ డిఫరెంట్.. సీనియర్ స్టార్ హీరోయిన్ ను శ్రీలీల తో పోలుస్తూ..!!

murali krishna
సాధారణంగా చిత్ర పరిశ్రమలో పోలికలు ఎక్కువ ఉంటాయి. ఒక నటుడు చనిపోతే .. ఆ ప్లేస్ ను వేరొకరితో రీప్లేస్ చేయడం చూస్తూనే ఉంటాం. ఎక్కువగా హీరోయిన్స్ విషయంలో ఈ పోలిక ఉంటుంది. ఉదాహరణకు సావిత్రి చనిపోయాకా .. ఆమెను రీప్లేస్ చేయడం ఎవరి వలన కాలేదు.. కానీ, నడవడిక, నటన ను బట్టి కీర్తి సురేష్, నిత్యా మీనన్ తో పోలుస్తూ వచ్చారు. ఆ తరువాత సౌందర్య.. సాయిపల్లవి నెక్స్ట్ సౌందర్య అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కుర్ర హీరోయిన్ శ్రీలీలను చనిపోయిన ఆర్తి ఆగర్వాల్ తో పోల్చడం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ . ఒకటి రెండు సినిమాలతో  పాపులారీటీ తెచ్చుకుంటున్నారు. ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలా వచ్చిన ముద్దుగుమ్మే శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వపర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ చిన్నది. అంతకు ముందు కన్నడ భాషలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది శ్రీలీల. ఇక పెళ్ళిసందడి సినిమాలో తన క్యూట్ లుక్స్ తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఆతర్వాత రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. వరుసగా రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో శ్రీలీలే క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది.ధమాకా తర్వాత వరుసగా లు చేసింది శ్రీలీల. స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం లు చేసింది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. వరుస లు చేసిన ఆ లన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. వీటిలో గుంటూరు కారం పర్లేదు అనిపించుకుంది. అయితే ల రిజల్ట్స్ ఎలా ఉన్న శ్రీలీల నటనకు ఆమె డాన్స్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తాజాగా శ్రీలీలే కొత్త ను అనౌన్స్ చేసింది. మరోసారి మాస్ మహారాజ రవితేజతో కలిసి నటించనుంది. ఇటీవలే ఈ పూజాకార్యక్రమాలు జరిగాయి. ఈ పూజాకార్యక్రమంలో శ్రీలీల అందరి దృష్టిని ఆకర్షించింది. మొన్నటివరకు సన్నగా సన్నజాజిలా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బొద్దుగా ముద్దుగా కనిపిస్తుంది. అయితే ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఆర్తి అగర్వాల్ తో పోల్చుతున్నారు. ఈ అమ్మడు చూడటానికి అచ్చం ఆర్తి అగర్వాల్ లానే ఉంది. శ్రీలీల, ఆర్తీ అగర్వాల్ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆర్తీ అగర్వాల్ ను ఆడియన్స్ అంత ఈజీగా మర్చిపోరు. చేసింది తక్కువ లే అయినా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. వెంకటేష్, నాగార్జున, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో నటించింది. అలాగే ఉదయ్ కిరణ్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించింది. ఆతర్వాత బరువు తగ్గడం కోసం సర్జరీ చేయించుకోగా అది వికటించి మరణించింది. ఇక ఇప్పుడు ఆర్తి అగర్వాల్ ఫ్యాన్స్ శ్రీలీలలో ఆమెను చూసుకుంటున్నారు. ఈ ఇద్దరి ఫోటోలును కలిపి వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: