ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్.. రూ.5 కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన అనుష్క..!

lakhmi saranya
కొంతమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ తమ క్రేజ్ ని మాత్రం ఆ విధంగానే నిలబెట్టుకుంటూ ఉంటారు. అసలు సినిమాల్లో కనిపించకపోయినా వారి గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటి వారిలో టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒకరు. సూపర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనంతరం వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఈ బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ జతకట్టి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
తెరపై తన గ్లామర్ తో ఆకట్టుకుంది. అరుంధతి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది అనుష్క శెట్టి. ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ తో బాహుబలి లో నటించింది. బాహుబలి మూవీ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో అనుష్క శెట్టి కెరీర్ పూర్తిగా మారిపోతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఈ సినిమా అనంతరం ఇండస్ట్రీకి చాలా కాలం గ్యాప్ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇటీవల మిస్ శెట్టి  మిస్టర్ పోలీ శెట్టి చిత్రంతో రియంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించాడు.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూ లతో సూపర్ హిట్ విజయం సాధించింది. ఇక అనుష్క ప్రస్తుతం క్రిష్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తుంది. ఓ భారీ బడ్జెట్ మూవీ లో స్టార్ హీరో సరసును అనుష్కని హీరోయిన్గా ఎంపిక చేయగా.. ఆమె నో చెప్పినట్లు తాజాగా సమాచారం అందుతుంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యం లేదని అందుకే ఈ పాత్రను రిజెక్ట్ రిజెక్ట్ చేసిందని సోషల్ మీడియాలో ఓ వార్త షికారు చేస్తుంది. అయితే ఈ పాత్రకి 5 కోట్ల వరకు ఆఫర్ చేశారట మేకర్స్. అయినప్పటికీ అనుష్క దీనికి ఒప్పుకోలేదట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: