తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో హిట్ కొట్టేసిన మహారాజా... ఇప్పటికే ఎంత లాభమో తెలుసా..?

Pulgam Srinivas
విజయ సేతుపతి హీరోగా రూపొందిన మహారాజా సినిమా జూన్ 14 వ తేదీన తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మంచి టాక్ లభించింది. దానితో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇక ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. భారీ మొత్తంలో ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినప్పటికీ ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఎన్ని లాభాలను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకి నైజాం ఏరియాలో 1.79 కోట్లు కలెక్షన్లు దక్కగా, సీడెడ్ లో 64 లక్షలు , ఆంధ్ర లో 1.49 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో కలిపి తెలుగు రాష్ట్రాల్లో 3.92 కోట్ల షేర్ , 7.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 42 లక్షల లాభాలను అందుకుంది. ఈ మూవీ లో మమతా మోహన్ దాస్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: