మోసపోయిన మెగాస్టార్ హీరోయిన్..!!

murali krishna
'నా మొదటి ప్రేమలేఖ' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ రిమి సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'అందరివాడు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటించిన రిమి సేన్.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తన స్నేహితుడిని నమ్మి ఏకంగా రూ.4.14 కోట్లు మోసపోయానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన ఫ్రెండ్ రోనక్ వ్యాస్ పై రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేసింది రిమి సేన్. ఈ కేసు ఇప్పుడు సీఐడీకి బదిలీ అయ్యింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిమి సేన్ తన స్నేహితుడు చేసిన మోసం గురించి.. అతని వల్ల ఎలా మోసం జరిగిందో కూడా వివరించింది. రిమి సేన్ మాట్లాడుతూ.. "రోనక్ వ్యాస్.. మూడేళ్ల క్రితం ముంబైలోని ఓ జిమ్ లో పరిచయమయ్యాడు. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దామని చెప్పి నా దగ్గర దశలవారీగా డబ్బులు తీసుకున్నాడు. ముందుగా రూ.20 లక్షలు ఇచ్చాను. దానికి 9 శాతం వడ్డీ ఓసారి ఇచ్చాడు. ఆ తర్వాత 12 నుంచి 15 శాతం వడ్డీ ఇస్తానని నమ్మించాడు. అల దశలవారీగా రూ.4.14 కోట్లు ఇచ్చాను. ఓసారి రూ.6 లక్షల వడ్డీ ఇచ్చి ఆ తర్వాత నుంచి కారణాలు చెప్పాడు.
తనకు కరోనా వచ్చిందని, తండ్రికి అనారోగ్యంగా ఉందని చెప్పేవాడు. క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నేను చాలా కాలం నమ్ముతూ వచ్చాను. కానీ ఆ తర్వాతే అర్థమయ్యింది అతడు మోసం చేస్తున్నాడని.. డబ్బు ఇవ్వకుండా నెలలపాటు ఆలస్యం చేస్తుండడంతో స్కామ్ చేశాడని అర్థమయ్యింది. ఇలాగే పలు సిటీల్లో చాలా మందిని మోసం చేశాడని తెలిసింది. దీంతో రోనక్ వ్యాస్ పై ఏడాదిన్నర క్రితమే ఖార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాను. ఇటీవలే సీఐడీ నుంచి కాల్ వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ కోసం నా లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు" అంటూ చెప్పుకొచ్చింది. రోనక్ ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. అతనికి ఇండియాలో ఆస్తులేమి లేనట్లు తెలిసిందని తెలిపింది రిమి సేన్. అతని ఆస్తులన్ని తన తల్లి, భార్య పేర్లపై కొన్నాడని దీంతో హైకోర్టులో ఛార్జ్ షీట్ నమోదైందని తెలిపారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: