పుష్ప 2 వాయిదాతో నిర్మాతలపై భారీగా బడ్జెట్ భారం.. ఎన్ని కోట్లు అంటే.‌.?

lakhmi saranya
సుకుమార్ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2. ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో హైప్స్ ఉన్నాయి. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ 6వ తేదీకి మూవీ టీం వాయిదా వేసింది. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే పుష్ప 2 రిలీజ్ వాయిదా పడడం వల్ల నిర్మాతలపై అదనపు భారం భారీగా పడుతుందని సమాచారం.
ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ సుమారు నాలుగు నెలలు వాయిదా పడడంతో మేకర్స్ పై మరింత భారం పడుతున్నట్లు తెలుస్తుంది. వాయిదా వల్ల సుమారు 40 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి అదనంగా ఖర్చు కానున్నట్లు ఈ మూవీ వర్గాలు చెప్తున్నట్లు ఓటీటి ప్లే రికార్డు వెల్లడించింది. పుష్ప టు సినిమా సుమారు 350 కోట్ల బడ్జెట్తో రూపొందుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా సుమారు 50 రోజులు మిగిలి ఉంది. కొన్ని సీన్స్ ను రీషుట్ కూడా చేయనున్నారట.
దీంతో ఈ సినిమా విడుదల వాయిదా వేయక తప్పలేదు. అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్స్ ఇంకా చాలా కాలం కొనసాగించాల్సి ఉంది. కొందరు నటీనటులు డేట్లు కూడా వృధా అయ్యాయి. మళ్లీ వారిని కొత్తగా డేట్స్‌ అడగాలి. ఇలా నిర్మాతలకు సుమారు 40 కోట్ల వరకు అదనంగా బడ్జెట్ భారం పెరుగుతుందనే అంచనాలు బయటికి వచ్చాయి. 2021 లో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ రికార్డులను క్రియేట్ చేసింది. దీనికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతుంది. దీంతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: