కాలికి గాయం అయింది.. అతడి కోసము మాత్రమే రిస్క్ తీసుకున్న.. వరుణ్ సందేశ్ కామెంట్స్..!

lakhmi saranya
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ నింద. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ తో యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ జూన్ 21న రిలీజ్ కాబోతుంది. మైత్రి మూవీస్ ఈ సినిమాను నైజం లో రిలీజ్ చేస్తుంది. ఇక ఈ చిత్రం పై పలు విషయాలను పంచుకునేందుకు వరుణ్ సందేశ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.." రొటీన్ సినిమాలు చేస్తూ ఉండడంతో నాకే బోరింగ్ గా అనిపించింది.
ఏంట్రా ఇలాంటి సినిమాలే చేస్తున్నానని అనుకునే సందర్భాలు వచ్చాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని యుఎస్ వెళ్ళా. ఆ టైంలోనే రాజేష్ గారు ఈ నింద కథను చెప్పారు. విన్న వెంటనే ఎంతో నచ్చింది. ఈ సినిమా చేద్దామని చెప్పాను. ఈ సినిమాలో నా పాత్రకి, నిజ జీవితంలోని నా పాత్రకి అసలు పోలిక ఉండదు. నేను బయట జాలిగా, చిల్గా ఉంట. నేను ఎప్పుడూ కూడా సీరియస్ గా ఉండను. కానీ ఈ చిత్రంలో నా వ్యక్తిత్వానికి అండ్ మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన పాత్రను పోషించారు. ఇక కానిస్టేబుల్ అనే సినిమా షూటింగ్లో నా కాలికి గాయమైంది. ఆ వెంటనే ఈ సినిమా షెడ్యూల్ ఉంది. అప్పటికే ఆర్టిస్టులు అంత రెడీగా ఉన్నారు. అంతా సెట్ అయ్యి ఉంది.
నా ఒక్కడి కోసం షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక రాజేష్ గారు డెడికేషన్ అండ్ ఫ్యాషన్ చూసి ఆ గాయంతోనే షూటింగ్ చేశాను. రాజేష్ గారి కోసమే ఈ రిస్క్ తీసుకున్నాను. మా దర్శకుడు, నిర్మాత రాజేష్ గారి ఫ్రెండ్ యూఎస్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆయన మైత్రి నవీన్ గారికి తెలుసు. అలా మైత్రి శశి గారు మా సినిమాను చూశారు. మూవీ నచ్చితేనే రిలీజ్ చేస్తానని శశి గారు అన్నారు. ఆయన చిత్రాన్ని చూశారు. బాగా నచ్చింది. అందుకే మా సినిమాను రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు " అంటూ తెలియజేశాడు వరుణ్ సందేశ్. ప్రజెంట్ వరుణ్ సందేశ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: