హిట్ స్టేటస్ కు ఇంకా అన్ని లక్షల దూరంలో మనమే.. శర్వా హిట్ కొట్టేనా..?

Pulgam Srinivas
శర్వానంద్ తాజాగా మనమే అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. విడుదల అయిన మొదటి రోజే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ సినిమా మొదటి రెండు, మూడు రోజులు పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్లు భారీగా పడిపోతాయి అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సినిమా కలెక్షన్లు వీక్ డేస్ లో కూడా స్టడీగా వచ్చాయి. ఆ తర్వాత రెండవ వారంలో కూడా ఈ మూవీ అటు హరోం హర , ఇటు మహారాజా సినిమాలను తట్టుకొని బాగానే నిలబడింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడానికి అతి దగ్గరగా ఉంది. ఈ సినిమాకు ఇంకా ఎన్ని లక్షల కలెక్షన్లు దక్కితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా కంప్లీట్ అవుతుంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 12 రోజులు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.47 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 84 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 3.64 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 12 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.95 కోట్ల షేర్ ... 15.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 12  రోజుల్లో 57 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 1.08 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 12 రోజుల్లో 9.60 కోట్ల షేర్ ... 18.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 40 లక్షల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: