'వాణిశ్రీ' దెబ్బకు షాక్ అయిన 'సోగ్గాడు'.??

murali krishna
టాప్ హీరోయిన్లు శోభన్ బాబుతో నటించాలనుకునేవారు. షూటింగ్ సమయంలో హీరోయిన్లతో ఆయన సరదాగా ఉండేవారు. అప్పటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీతో కలసి శోభన్ బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు.సోగ్గాడు శోభన్ బాబు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. తీవ్రమైన పోటీలో కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి అగ్ర నటుల జాబితాలో శోభన్ బాబు చేరారు. శోభన్ బాబు వ్యక్తిత్వం గురించి, జీవితంలో ఆయన పర్తించే విలువల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శోభన్ బాబు అందగాడు మాత్రమే కాదు.. మంచి మనసున్న వ్యక్తి కావడంతో అప్పట్లో హీరోయిన్లకి ఆయనంటే ఇష్టం ఉండేది.అప్పటి టాప్ హీరోయిన్లు శోభన్ బాబుతో నటించాలనుకునేవారు. షూటింగ్ సమయంలో హీరోయిన్లతో ఆయన సరదాగా ఉండేవారు. అప్పటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీతో కలసి శోభన్ బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. మిడిల్ ఏజ్ వచ్చాక కూడా శోభన్ బాబు, వాణిశ్రీ కలసి నటించిన చిత్రాలు ఉన్నాయి. శోభన్ బాబు, వాణిశ్రీ కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ చెల్లెలి కాపురం అని చిత్రంలో నటించారు.లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి కానగల జయకుమార్ రచయితగా పనిచేశారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనని జయకుమార్ రివీల్ చేశారు. కవితలు రాసి తన చెల్లికి పెళ్లి చేయాలనుకునే ఒక అన్న కథ ఈ చిత్రం. శోభన్ బాబుతో తెలియకుండా వాణిశ్రీ ప్రేమలో పడుతుంది. అయితే కొన్ని మలుపులు చోటు చేసుకుంటాయి.
 
క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ ఆ సాంగ్ కి వాణిశ్రీ చేసే డ్యాన్స్ ఈ చిత్రానికి ఆయువుపట్టు అని జయకుమార్ అన్నారు. సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. శోభన్ బాబు పాడుతుంటే. దానికి తగ్గట్లుగా వాణిశ్రీ డ్యాన్స్ చేయాలి. అది సన్నివేశం. సి నారాయణ గారు ఈ పాటని ఎక్కువగా సంస్కృత పదాలు ఉండేలా రాశారు. మొదట ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ కెవి మహదేవన్ ఒప్పుకోలేదు.సి నారాయణ గారు మొత్తం వివరంగా చెప్పి మహదేవన్ ని ఒప్పించారు. షూటింగ్ కి అంతా సిద్ధం అయ్యారు. శోభన్ బాబు లిప్ మూమెంట్ ఇవ్వాలి.. లేదా పాడాలి. కాబట్టి పాటని నేను ఆయనకి ఇచ్చాను. నేను శోభన్ బాబుని అన్నగారు అని పిలిచేవాడిని. నేను అన్నగారు ఇంత జఠిలమైన పాటని పలకగలరా అని అడిగా.. ఆయన సరదాగా ఓ అదెంత సేపు ఈజీగా పలికేస్తా అని చెప్పారు. నువ్వు చెబుతూ ఉంది నేను పెదాలు ఆడిస్తా అని అన్నారు.శోభన్ బాబు ఆ పాటని ప్రాక్టీస్ చేస్తుండగా పక్కనే వాణిశ్రీ ఉన్నారు. ఒక పదాన్ని కచభర అని అనకుండా కుచభర అని శోభన్ బాబు చదువుతున్నారు. అది విన్న వాణిశ్రీ గారు శోభన్ బాబు అసలు నువ్వు పలికే మాటకి నీకు అర్థం తెలుసా అని అడిగింది. ఓ ఎందుకు తెలియదు తెలుసు.. కుచభర అంటే సన్నని నడుము అని చెప్పారు. వాణిశ్రీ కి దాని అర్థం తెలిసినట్లు ఉంది. శోభన్ బాబు చెప్పింది కరెక్టా అని నన్ను అడిగింది.కచభర అంటే నీలమైన కురులు అని చెప్పా. కానీ శోభన్ బాబు కుచభర అంటున్నారు. అంటే తప్పు మీనింగ్ వస్తుంది. నేను చెప్పలేక చెబుతూ దాని అర్థం మహిళల బరువైన వక్షోజాలు అని చెప్పా. శోభన్ బాబు తన తప్పుకి షాక్ అయ్యారు. వాణిశ్రీ గారు నవ్వుకుంటూ వెళ్లిపోయారు అని రచయిత జయకుమార్ అన్నారు. తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ లో ఆయన ఈ విషయాలని రివీల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: