ఎయిర్ పోర్ట్ లో అలా దర్శనం ఇచ్చిన బ్యూటీ...!

murali krishna
శృతి హాసన్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఆమెకు వెనక కొండంత అండగా తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. హీరోయిన్‌గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌లా మారింది.శృతి హాసన్ ఆ మధ్య సినిమాలను గ్యాప్ ఇచ్చి.. ఇక ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్‌లో కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా డిసెంబర్ 22న భారీగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు శృతి హాసన్ ఏజ్ 38 ఏళ్ళు. అయితే, ఆవిడకు అంత వయసు ఉన్నట్టు కనిపించదు అనుకోండి. ఎవర్ గ్రీన్ బ్యూటీలా మేలిమి ఛాయతో మెరుస్తూ ఉంటుంది.అటువంటి శృతి లేటెస్ట్ ఎయిర్ పోర్ట్ లుక్ అందరికీ షాక్ ఇచ్చింది.షూటింగ్స్ కోసం మాత్రమే కాదు... ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్టుకు వచ్చే సమయాల్లో కూడా హీరోయిన్లు ప్రత్యేకంగా రెడీ అయ్యే రోజులు ఇవి. అయితే, శృతి మాత్రం సంథింగ్ డిఫరెంట్. వెరైటీ డ్రస్ వేశారు గానీ మేకప్ మాత్రం మినిమల్ గా ఉండేలా చూసుకున్నారు.
 
శృతి హాసన్ ఫేవరెట్ కలర్ బ్లాక్. బ్లాక్ అండ్ బ్లాక్ టాప్, బాటమ్, టీ షర్టులో ఆమె ఎయిర్ పోర్టుకు వచ్చారు. మేకప్ అయితే అసలు లేదని చెప్పాలి. దాంతో ఆమెను ఎవరైనా హీరోయిన్ అంటే నమ్ముతారా? అంత సింపుల్ గా ఉందేంటి? అని కొందరు కామెంట్ చేస్తున్నారు. శృతి సింప్లిసిటీని పొగుడుతున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్'లో శృతి హాసన్ ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఆ మూవీలో మరొక హీరోయిన్ లేదు. కానీ, ప్రభాస్ & శృతి మధ్య లవ్ లేదా రొమాంటిక్ సీన్లు, సాంగ్స్ కూడా లేవు. అయితే, ఆ మూవీతో శృతి భారీ విజయం అందుకున్నారు.ప్రజెంట్ అడివి శేష్ 'డెకాయిట్'లో శృతి హాసన్ యాక్ట్ చేస్తున్నారు. అది పాన్ ఇండియా సినిమా. 'సలార్ 2'తో పాటు మరొక సినిమా 'చెన్నై స్టోరీ'  ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: