మేకర్స్ ఆలోచన అలా ఉంటే నందమూరి... మెగా హీరోల మధ్య గట్టి పోటీనే ఉండనుందా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి , మెగా హీరోలకు అద్భుతమైన గుర్తింపు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఇరు కుటుంబాల నుండి ఇప్పటికే ఎంతో మంది హీరోలు వచ్చారు. వారిలో చాలా మంది మంచి సక్సెస్ కూడా అయ్యారు. ఇకపోతే వీరి కుటుంబాల నుండి మంచి క్రేజ్ ఉన్న హీరోల సినిమాలు వచ్చాయి అంటే వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. అదే సినిమాలకు హిట్ టాక్ వచ్చినట్లు అయితే కలెక్షన్ల వర్షం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తూ ఉంటుంది.

ఇంతటి క్రేజ్ కలిగిన ఇద్దరు కుటుంబాల నుండి స్టార్ హీరోలు ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం "ఎన్ బి కే 109" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే డిసెంబర్ 6 న పుష్ప పార్ట్ 2 విడుదల ఉండడంతో ఈ మూవీ ని డిసెంబర్ రెండవ , లేదా మూడవ వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ లో స్టార్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన లేదా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 20 వ తేదీన కనుక ఈ మూవీ ని విడుదల చేసినట్లు అయితే నందమూరి హీరో అయినటువంటి బాలకృష్ణ కు , మెగా హీరో అయినటువంటి రామ్ చరణ్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీనే ఉండే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలను ఏ తేదీలలో విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: