షాకింగ్: కల్కి కథ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..!?

Anilkumar
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈనెల 27న భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులను పూర్తి చేసుకుంది. అందుకే చిత్ర బృందం సైతం దీనికి సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రోజుకు ఒకటి విడుదల చేస్తూ కల్కి పై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక ఇటీవల ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం ఇప్పుడు సినిమా స్టోరీ మొత్తం లీక్ చేశారు. ఆ లీక్ చేసింది మరెవరో కాదు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే తాజాగా ఆయన ఈ సినిమాకి సంబంధించిన స్టోరీని చెబుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 అదేంటంటే.. ఆయన ఈ సినిమా స్టోరీ చెబుతూ ఇక ఇప్పటి వరకు పురాణాల్లో మనం చూసిన క్యారెక్టర్లన్నింటికీ ఇది చివరి వర్షన్ గా వస్తుందని చెప్పాడు. ఇక అలాగే ఇక చిన్నప్పటి నుంచి తను పాతాళభైరవి, ఆదిత్య 369, భైరవద్వీపం లాంటి సినిమాలు చూస్తూ పెరగడట.. ఇక హాలీవుడ్ లో స్టార్ వార్స్ లాంటి సినిమాలను చూసినప్పుడు మాత్రం అంత టెక్నాలజీ ని వాడుకొని వాళ్ళు అలాంటి సినిమాలు చేసినపుడు మనం కూడా అలాంటి సినిమాలు చేయొచ్చు కదా అనే ఉద్దేశ్యం తోనే ఒక భారీ స్కేల్ తో ఈ సినిమాని రూపొందించడానికి నాగ్ అశ్విన్ శ్రీకారం చుట్టాడట… కలియుగాంతం మొత్తానికి ఈ సినిమానే ఎండ్ అవ్వాలి అనే ఉద్దేశ్యం తో సినిమా

 స్టోరీ ని స్టార్ట్ చేసి ఇందులో అన్ని దేశాల ఇన్వాల్వ్ మెంట్ ఉండే విధంగా కథను రాసుకుంటూ వచ్చారట. అలా ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని ఒక కొలిక్కి అయితే తీసుకొచ్చాడు. ఇక దేవుడి అవతారాలను చూసుకుంటే శ్రీకృష్ణ అవతారంతో శ్రీ మహా విష్ణువు అవతారాలు అన్ని ముగుస్తాయి. అంటూ ఒకదాని వెంట ఒకటి ఈ సినిమాలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రేక్షకులకు వెల్లడించడు. అలా ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ మొత్తం లీక్ చేసాడు  అశ్విన్. దీంతో ప్రస్తుతం నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: