ఇకమీదట కేవలం అలాంటి పాత్రలే చేస్తా.. రాశి ఖన్నా..!?

Anilkumar
టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నటిగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అలా ఇప్పటివరకు టాలీవుడ్ ని ఇండస్ట్రీలో ఉన్న చాలావరకు యంగ్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది. ఇక ఆ సినిమాల తర్వాత వరుసగా మంచి విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఇక ఇటీవల ఈమె హిందీలో వరుస సినిమాలో చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఆమె చేసిన హిందీ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పిస్తుంది. తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో సినిమాలు చేస్తున్న ఈమె ఇటీవల అరణ్మనై 4 అనే సినిమాలో నటించింది. ఇందులో రాసి కన్నా తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన తమన్నా సైతం ఉంది. అయితే మొదట పలు సినిమాలలో చాలా డీసెంట్గా తెలుగు అమ్మాయిల కనిపించిన రాశి కన్నా రాను రాను సినిమా ఆఫర్లు రావడంతో గ్లామర్ షో కి తెరతీసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో ఆమె చేస్తున్న సినిమాలన్నిటి లో కూడా గ్లామర్ షో కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనబడుతోంది.

అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆడియన్స్ను మైమరిపిస్తూ ఉంటుంది.. ఐతే తాజాగా.. సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా నటిస్తున్న ఈ అమ్మడు ఇక ముందు తాను చేయబోతున్న సినిమాలు మరియు సిరీస్‌ లు వాటిల్లో తాను కనిపించే విధానం చాలా స్పెషల్‌ గా ఉండబోతున్నట్లుగా పేర్కొంది. ఇటీవల రాశి ఖన్నా షేర్‌ చేస్తున్న పాత్రలతో మరింత గుర్తింపును సొంతం చేసుకుంది.  గ్లామర్‌ పాత్రలు చేయడం ద్వారా రాశి ఖన్నా ఇన్నాళ్లు వార్తల్లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: