ఆ విషయంలో మరో రికార్డ్ బ్రేక్ చేసిన ప్రభాస్ కల్కి..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. ఇందులో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న విడుదల కాబోతోంది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో ఉన్న సినీ లవర్స్ అందరూ దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతుండడం తో ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్ర బృందం. ఒక్కొక్క రోజు సినిమాకి సంబంధించిన ఒక్కో అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ

 పెంచేస్తున్నారు. ఇక ఇటీవల బుజ్జి అంటూ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించే ఒక రోబోట్ కార్ ను పరిచయం చేస్తూ ఒక ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. ఇక దాంతో సినిమాపై అంచనాలో తారా స్థాయికి చేరుకున్నాయి. ఇక నిరంతరం ఆ బుజ్జి కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఇందులో నుండి ఒక పాటను విడుదల చేశారు చిత్ర బృందం. ఇక ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్తో దోసుకుపోతోంది. అంతేకాదు తాజాగా ఇప్పుడు ఈ సినిమా మరొక

 రికార్డు సైతం బద్దలు కొట్టింది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అదేంటంటే.. ఉత్తర అమెరికాలో $2 మిలియన్ ప్రీ సేల్స్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలవడం విశేషం.. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ కు ముందే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.. ఈ సినిమా ప్రీమియర్ షోలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.. ఒక్క నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ల డాలర్లు కొల్లగొడితే.. అది కూడా విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంటే.. ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించడం కష్టమని ఫ్యాన్స్ అంటున్నారు.. మరోవైపు ఓటీటీ పార్ట్నర్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకుంది.. నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: