నాని సుజిత్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!?

Anilkumar
గత ఏడాది హాయ్ నాన్న సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న నాచురల్ స్టార్ నాని ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోధ శనివారం అనే సినిమా చేస్తున్నాడు. దసరా సినిమా తర్వాత నాని మళ్లీ మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు.  ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. డి వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే నిర్మాతలు బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు అని తెలుస్తోంది. అయితే ఇదివరకు వివేక్ ఆత్రేయ.తో అంటే సుందరానికి సినిమా చేశాడు నాని. కానీ ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాంతో ఈసారి

 ఎలాగైనా సరిపోదా శనివారం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలి అని తమ సత్తా ఏంటో చూపించాలి అని ఫిక్స్ అయ్యాడు డైరెక్టర్. అయితే ప్రస్తుతం ఈ సినిమాతో బిజీగా ఉన్న నాచురల్ స్టార్ నాని దీని తర్వాత స్టార్ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా సైతం డివివి దానయ్య బానర్లోనే రాబోతోంది. ఇకపోతే ప్రస్తుతం సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ జి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగే దిశగా ఉంది. అందుకే ఈ సినిమా తర్వాత నానితో సినిమా చేయాలని చూస్తున్నాడు సుజిత్. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు.. వీళ్ళిద్దరి కాంబినేషన్లో

 వచ్చే సినిమాకి సంబంధించిన బడ్జెట్ విషయంలో కొన్ని అవకతవకులు వచ్చాయని అంటున్నారు.  నాని ఏ సినిమా చేసిన కూడా హై రేంజ్ బడ్జెట్ కాకుండా మీడియం రేంజ్ బడ్జెట్ తో సినిమాలు చేస్తాడు. ఆ సినిమాలతోనే మంచి విజయాన్ని అందుకుంటాడు. కానీ సుజిత్ మాత్రం నాని కి డబుల్ బడ్జెట్ కోట్ చేశాడని తెలుస్తుంది. అందుకే నిర్మాత దానయ్య ఈ సినిమా విషయంలో వెనక్కి తగ్గారని అంటున్నారు. ఐతే ఈ సినిమా హీరో డైరెక్టర్ కాంబోని రిపీట్ చేస్తే ప్రాజెక్ట్ వేరే నిర్మాతల చేతుల్లోకి వెళ్లిందని అంటున్నారు. ఐతే ఆ కొత్త నిర్మాతలు ఎవరన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. దసరా ముందు వరకు నాని సినిమాల లెక్క వేరే కానీ సరీన సినిమా పడితే తాను కూడా 100 కోట్లు కొడతా అని ప్రూవ్ చేశాడు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: