మరోసారి గ్లామర్ షో తో పిచ్చెక్కించేసిన కీర్తి సురేష్.. ఈసారి అలా..!

Anilkumar
టాలీవుడ్ లో మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అలా స్టార్ హీరోయిన్గా మారింది. అంతేకాదు ఆ సినిమా తర్వాత నుండి ఇప్పటివరకు వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే నేను శైలజా సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ నేను లోకల్ అనే సినిమాతో స్టార్ హీరోయిన్గా వెలిగింది. దాని తర్వాత మహానటి బయోపిక్ లో సావిత్రి

 పాత్రను చేసి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి చేరిపోయింది. దాని తర్వాత చాలా సినిమాలు చేసింది. అయితే కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ మరికొన్ని సినిమాను ఫ్లాపులుగా మారాయి. దీంతో  సరైన హిట్  ఖాతాలో పడలేదు. అలా ప్రస్తుతం మళ్ళీ కమర్షియల్ సినిమాలు చేయాలి అని ఫిక్స్ అయిందట కీర్తి సురేష్. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో భాగమవుతుంది. అది ఏ విధంగా అన్నది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కానీ దానికి సంబంధించిన కొంతవరకు క్లారిటీ అయితే వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలతో కీర్తి సురేష్ ఎంత

 బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ సినిమాలకి సంబంధించిన అప్డేట్ తన పర్సనల్ విషయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా తనకి సంబంధించిన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. దీనితో ఆ ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. కీర్తి సురేష్ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా కుర్రాళ్ళు ఫిదా అవుతుంటారు. ఇక ఆమె చీర కడితే రెండు కళ్ళు సరిపోవు. రీసెంట్ గా అమ్మడు మరోసారి అందమైన చీరలో కనిపించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. అమ్మడు తన నవ్వుతోనే ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: