పుష్ప తర్వాత అల్లు అర్జున్ ప్లానింగ్ ఏంటి.. ఆ సినిమా చేస్తాడా..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. అదే గత కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ ఫలానా స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎటువంటి నిజం లేదు అని తెలిసిపోయింది. అంతేకాదు వాటికి సంబంధించిన ఎటువంటి క్లారిటీ కూడా ఇప్పటివరకు ఇవ్వలేద.. ఇక అసలు విషయంలోకి వెళితే.. జవాన్ సినిమాతో 1000 కోట్లకు

 పైగానే బాక్సాఫీస్ ని కొల్లగొట్టాడు అట్లీ. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది అన్న క్లారిటీ మాత్రం లేదు. అయితే ఈ సినిమానే కాకుండా బన్నీ పుష్ప తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆమధ్య దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు. కానీ ఆ ఒక్క ప్రకటన తోనే ఆపేసారు. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న నాలుగవ సినిమా ఇది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ సినిమా విషయంలో గ్యారెంటీ లేదు అని

 అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. కానీ అందులో కూడా క్లారిటీ లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా వస్తుందా రాదా అన్న క్లారిటీ లేకపోయినప్పటికీ వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే కచ్చితంగా ఈసారి అలా వైకుంఠపురం లో సినిమా కంటే మించిన సక్సెస్ అవుతుంది అని కోరుకుంటున్నారు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ తో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.. మరి ఈ ముగ్గురి డైరెక్టర్స్ లో అల్లు అర్జున్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: