ఆ సినిమా దెబ్బకి నా సినిమా పనైపోయింది... వైవిఎస్ చౌదరి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమంలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో వై వి ఎస్ చౌదరి ఒకరు. ఈయన ఇప్పటికే అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజాయలను కూడా అందుకున్నాయి. ఇకపోతే ఆఖరుగా ఈ దర్శకుడు రేయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఈయన దర్శకత్వంలో రూపొందిన దేవదాస్ సినిమా విడుదల సమయంలో ఎలాంటి సన్నివేశాలు జరిగాయి అని వివరాలను ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. నేను దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా 2006 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తేదీన విడుదల అయింది. ఆ సినిమా విడుదల సమయంలో రామ్ కి పెద్దగా మార్కెట్ లేదు. దానితో ఆ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఆ తర్వాత రోజు స్టైల్ సినిమా విడుదల అయింది. ఆ సినిమాలో టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరో అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ బిగ్గెస్ట్ క్లాస్ హీరో అయినటువంటి నాగార్జున ఇద్దరు కూడా ఆ సినిమాలో గెస్ట్ పాత్రలలో నటించారు.

దానితో ఆడియన్స్ అంతా అటు వైపే మొగ్గు చూపారు. దెబ్బకు నా సినిమా పని అయిపోయింది. ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు , లక్ష్మి మూవీ లు విడుదల అయ్యాయి. జనాలు అంతా ఈ మూడు సినిమాల పైన ఇంట్రెస్ట్ చూపించారు. ఇక సంక్రాంతి హాలిడేస్ మొత్తం ముగిశాక నా సినిమాను నేను పబ్లిసిటీ చేసుకున్నాను. ఆ తర్వాత సినిమాకి జనాలు రావడం మొదలు అయింది. అలా స్టైల్ , చుక్కల్లో చంద్రుడు , లక్ష్మి మూవీ ల ప్రభావంతో నా సినిమాకు మొదట పెద్దగా కలెక్షన్ లు రాలేదు అని వైవిఎస్ చౌదరి తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: