"నింద" ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వేదిక ఖరారు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో వరుణ్ సందేశ్ ఒకరు. ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన హ్యాపీ డేస్ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయనకు వరుసగా మంచి సినిమాలలో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈయన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన కొత్త బంగారు లోకం సినిమాలో హీరో గా నటించాడు.
 

ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. దానితో ఈయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన అనేక సినిమాలలో నటించిన అందులో ఒకటి , రెండు మినహాయిస్తే ఈయనకు ఏ సినిమా మంచి విజయాన్ని అందించలేదు. కొన్ని రోజుల క్రితమే ఈయన చిత్రం చూడరా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తాజాగా ఈ నటుడు నింద అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జూన్ 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు అనగా జూన్ 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హోటల్ ఆవాస , హైటెక్ సిటీలో నిర్వహించనున్నట్లు , ఈ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: