ఐటమ్ సాంగ్ కి రెడీ అవుతున్న పుష్ప?

Purushottham Vinay
పుష్ప సినిమా అంతపెద్ద హిట్టు కొట్టిందంటే సగం ఆ సినిమా పాటలే దానికి కారణం. అందులోనూ సమంత ఐటమ్ బ్యూటీగా అదరగొట్టిన ఊ అంటావా పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత తన డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ తో నేషనల్ వైడ్ గా అలరించింది. రెండున్నరేళ్ల క్రితం విడుదలైన పుష్ప సినిమా హిట్ కావడంలో ఆ సాంగ్ కూడా ముఖ్య పాత్ర పోషించింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే.దీంతో సీక్వెల్ లో కూడా ఐటెం సాంగ్ పై డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ గా గట్టి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఓ ఐటమ్ సాంగ్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ పాటలో బన్నీతో స్టెప్పులేసేది ఎవరనేది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. సమంతనే మళ్లీ అల్లు అర్జున్ తో చిందులేస్తుందని వార్తలనేవి వచ్చాయి. కానీ ఆ తర్వాత సామ్ ఆ సాంగ్ చేయడం లేదని ఫుల్ క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ బ్యూటీలు దిశా పటానీ, జాన్వీ కపూర్ ఇంకా ఊర్వశి రౌతేలా పేర్లు వినిపించాయి.రీసెంట్ గా యానిమల్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చి త్రిప్తి డిమ్రీ ఫిక్స్ అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. బన్నీతో ఆ బ్యూటీ చిందులేయడం దాదాపు ఖాయమైనట్లేనని కూడా టాక్ బలంగా వచ్చింది. కానీ ఆమె ఇప్పుడు ఓకే చెప్పలేదని సమాచారం తెలుస్తోంది.


 ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ ను వీలైనంత త్వరగా షూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అందుకే ఈ వారంలోనే సాంగ్ లో డ్యాన్స్ చేయనున్న బ్యూటీని ఫిక్స్ చేయనున్నారని సమాచారం తెలుస్తుంది. ఈ సినిమాను ఆగస్టు 15 న విడుదల చేస్తామని మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ అన్నట్లుగా పోస్టర్లు కూడా విడుదల చేశారు. చాలా సార్లు మూవీని అనుకున్న తేదీకే విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగస్టు 15కి రెడీ అయిపోయారు. కానీ ఇప్పటి దాకా ఇంకా షూటింగ్ పూర్తవ్వలేదు. తాజాగా కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు మేకర్స్.దీంతో ఈ సినిమా షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్స్ అయినప్పటికీ.. చాలా నెలలు పడుతుందని చెబుతున్నారు. అందుకే మూవీ డిసెంబర్ నెలకు పోస్ట్ పోన్ అవుతుందని సమాచారం తెలుస్తుంది. కానీ మేకర్స్ మాత్రం అనుకున్న తేదీకే సినిమాను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట.అందుకే స్పెషల్ సాంగ్ ను త్వరగా కంప్లీట్ చేయనున్నారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: