టాలీవుడ్: చాలా రోజులకి వరుస హిట్లతో కళకళలాడుతుందిగా?

Purushottham Vinay
ఎన్నికలు, ఐపిఎల్ కారణంగా వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎన్నడూ లేనంతగా దారుణంగా మారింది. దేవర, కల్కి వంటి పెద్ద హీరోల సినిమాలను మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు.మిడ్ రేంజ్ హీరోల సినిమాలు భయపడి వెనక్కి వెళ్లాయి. అయితే కొన్ని చిన్న చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా అవి మూవీ లవర్స్ ను మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. అలా కొన్ని చోట్ల థియేటర్లు మూతపడ్డాయని కూడా వార్తలనేవి వచ్చాయి.అయితే గత నెలలో మళ్లీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి మళ్లీ మొదలైంది. మే చివరి వారంలో ముగ్గురు యంగ్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి. వాటిలో రెండు చిత్రాలు మంచి టాక్ అందుకున్నాయి. ఆ తర్వాత గత వారం శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామ, నవదీప్ లవ్ మౌళి సినిమాలు రిలీజ్ అయ్యాయి. మనమే పాజిటివ్ టాక్ దక్కించుకుని మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ కూడా అందుకుంది.ఇక ఇక ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. సుధీర్ బాబు హరోం హర, అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి, విజయ్ సేతుపతి మహారాజ, చాందినీ యేవమ్ ఇంకా ఇంద్రాణితో పాటు మరిన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే హరోం హర, మ్యూజిక్ షాప్ మూర్తి, మహారాజ సినిమాలు మాత్రం చెప్పుకోదగ్గ మంచి టాక్ దక్కించుకున్నాయి. 


వీటిలో ఒక్కో సినిమా ఒక్కో విధంగా పాజిటివ్ టాక్ అందుకుంది.దీంతో చాలా రోజులకు టాలీవుడ్ లో ఇలాంటి మంచి పరిస్థితి కనిపించింది.సుధీర్ బాబు హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన హరోం హర సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా యాక్షన్ ప్రియులను తెగ అలరిస్తోంది. రిలీజ్ కి ముందు రోజు వేసిన పెయిడ్ ప్రీమియర్స్ కు వచ్చిన డీసెంట్ టాక్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అలాగే నటుడు అజయ్ ఘోష్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన మ్యూజిక్ షాప్ మూర్తి.. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఈ మూవీలో అజయ్ ఘోష్ యాక్టింగ్ హైలెట్ గా నిలవగా.. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది.ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి మహారాజ సినిమా మూవీ లవర్స్ ను ఎంతగానో అలరిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు నెలకొన్న అంచనాలను అందుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మేకింగ్ తో పాటు విజయ్ సేతుపతి యాక్టింగ్ కు కూడా అంతా ఫిదా అవుతున్నారు.అందుకే థియేటర్లకు ఆడియన్స్ తరలి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: