మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనున్న నాచురల్ స్టార్ నాని.. స్పెషల్ ట్వీట్..!

lakhmi saranya
టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎంతోమంది హీరోలు మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఒక సొంత ట్యాగ్ని ప్రేక్షకుల నుంచి పొందగలరు. అలా నాచురల్ స్టార్ అనే ట్యాగ్ని పొందాడు నాని. ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఇక ఇటీవల హాయ్ నాన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని మంచి హిట్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప్రజెంట్ నాని చేస్తున్న తదుపరిచిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రంతో ప్రేక్షకులం ముందుకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ఈ హీరో. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుణ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ జే సూర్య, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఫస్ట్ సింగిల్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మేరకు.." పేజీలు తిప్పుతూ.. రోజులు కౌంట్ చేయండి.
సూర్య పిచ్చిని చూసేందుకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. జూన్ 15న మీ ముందుకు గరం గరం సాంగ్ " అంటూ ట్విట్ చేశారు. ప్రజెంట్ ఈట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందిగా.. వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రేక్షకులు. కాగా సరిపోదా శనివారం మూవీ ఆగస్టు 29న గ్రాండ్గా రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ నాని కెరీర్ లో ఎటువంటి సక్సెస్ ని తెచ్చి పెడుతుందో చూడాలి. ప్రెసెంట్ నాని వరస సూపర్ హిట్ లు తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ చిత్రం కూడా నాని కి సూపర్ హిట్ తెచ్చి పెడితే ఇక మనోడికి తిరిగే ఉండదని చెప్పుకోవచ్చు. ఇక ప్రజెంట్ నాని చేస్తున్న తదుపరిచిత్రం సరిపోదా శనివారం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: