వారికి టెన్షన్ పుట్టిస్తున్న సమంత..?

Pulgam Srinivas
wమోస్ట్ బ్యూటిఫుల్ నటీమని సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె ఏం మాయ చేసావే మూవీ తో సినీ కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అప్పటి నుండి తెలుగులో ఈమెకు వరుస క్రేజీ సినిమా అవకాశాలు తగ్గడం , అందులో చాలా మూవీ లతో మంచి విజయాలు సొంతం చేసుకోవడంతో ఈమె చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్ళింది. అదే స్థానాన్ని ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తుంది.

ఇక తెలుగులో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయంలోనే ఈ బ్యూటీ తమిళ సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా అద్భుతమైన స్థాయికి వెళ్ళిపోయింది. చాలా సంవత్సరాలు తెలుగు , తమిళ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా హిందీ సినీ పరిశ్రమపై కన్ను వేసింది. అందులో భాగంగా వరుసగా హిందీ వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తుంది. అలాగే కొన్ని బాలీవుడ్ సినిమాలలో కూడా ఈమెకు అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత మరో ఇండస్ట్రీ పై కన్ను వేసినట్లు తెలుస్తోంది.

సమంత మరికొన్ని రోజుల్లోనే మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మమ్ముట్టి హీరోగా రూపొందబోయే సినిమాల్లో కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈమె నటించిన ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే మలయాళంలో కూడా ఈమెకు భారీ సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. దానితో అక్కడి స్టార్ హీరోయిన్ల అవకాశాలకు గండిపడే అవకాశం ఎంతైనా ఉంది. దానితో ఈమె రాకతో పలువురు మలయాళ స్టార్ హీరోయిన్లు టెన్షన్ పడే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: