చంద్రబాబు : తొలి సంతకంతో చిగురించిన నిరుద్యోగుల ఆశలు..!

FARMANULLA SHAIK
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా సచివాలయానికి చేరుకున్న చంద్రబాబుకి రాజధాని రైతులు అమరావతి నిర్మాతకు జయహో చంద్రన్న అంటూ గజమాలతో సాగర స్వాగతం పలికారు. అమరావతికి రక్షకుడువి నువ్వేనంటూ  వేల మంది రైతులు, మహిళలుఆయన వెంట సచివాలయం దాకా పూల వర్షం కురిపించుకుంటూ పోయారు సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు సరిగ్గా నాలుగు నలభై ఒకటికి తన బాధ్యతలను చేపట్టారు.మొదటగా అతి ముఖ్యమైన ఐదు ఫైళ్లపైన ఆయన సంతకాలు పెట్టారు. అధికారంలోకి వస్తే మెగాడీ చేసి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆహామీను నిలబెట్టుకునే విధంగా అడుగులు వేశారు. ముఖ్య నేతల సమక్షంలో ఆయన మొదటి సంతకాన్ని డీఎస్సీ ఫైల్ పై పెట్టారు. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మూడవ సంతకం పింఛన్ల పెంపుపై నాలుగో సంతకం అన్న క్యాంటీన్లపై ఐదవ సంతకం నైపుణ్య గణనపై చేసి తన హామీలు నిలబెట్టుకున్నారు. అయితే మొదటి సంతకం మెగా డియస్సి పైన ఎంతోమంది నిరుద్యోగులు గత ఐదు సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాచేదాక వేచి చూస్తున్నారు. చంద్రబాబు తొలి సంతకంతో నిరుద్యోగుల  భవిష్యత్తు మారిపోయే విధంగా ఉందని నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డీఎస్సీలో సవరణలు చేసి విద్యాశాఖ తో చర్చించి నిరుద్యోగులు హ్యాపీగా ఉండే విధంగా మెగా డీఎస్సీతో నోటిఫికేషన్ జారీ చేస్తామని చంద్రబాబు అన్నారు.ప్రాథమిక పాఠశాలలో మొత్తం మీద 13 వేల పోస్టులు ఖాళీలుగా ఉన్నట్టు ప్రాథమికంగా అధికారులు సేకరించి ఒక నివేదికను తయారు చేసినట్లు తెలుస్తుంది. అయితే దానిపై సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించి తగు సమాచారం ఇవ్వనట్లు తెలుస్తుంది.అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మెగా డీఎస్సీలో భాగంగా ఎస్ జి టి పోస్ట్లు 6371 అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7725  ఉన్నట్లు గుర్తించారు. వాటితో కూడిన ఫైల్ పైన చంద్రబాబు తన మొదటి సంతకాన్ని చేసి అన్న మాట నిలబెట్టుకున్నారు. ఆ ప్రకటనతోడీఎస్సీ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: