6 రోజుల్లో "మనమే" కి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
శర్వానంద్ హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ జూన్ 7 వ తేదీన మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఆ 6 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి , మొత్తంగా ఎంత కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
ఈ మూవీ కి 6 రోజుల్లో నైజాం ఏరియాలో 2.42 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 60 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.60 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల్లో ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.62 కోట్ల షేర్ ... 10.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా లో కలుపుకొని 6 రోజుల్లో 48 లక్షల కలెక్షన్ లు దక్కగా , ఓవర్ సీస్ లో 92 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో 7.02 కోట్ల షేర్ ... 13.60  కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ మూవీ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 2.98 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: