టాలీవుడ్ ఒకేసారి రెండు సినిమాలు.. మొదటిసారి అలాంటి రిస్క్ చేయబోతున్న శర్వానంద్..!?

Anilkumar
టైర్ 2 హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ స్టార్ హీరో మాత్రం అవ్వలేకపోయాడు. ఇందులో భాగంగానే తాజాగా మనమే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఈనెల 7న,  విడుదలైన ఈ సినిమా బ్లాక్ మాస్టర్ అవలేకపోయినప్పటికీ పాజిటివ్ టాక్ మాత్రం తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత వెంటనే రామ్ అబ్బరాజు

 దర్శకత్వంలో తన తదుపరి సినిమా కూడా ప్రారంభించేశాడు శర్వానంద్. ఈ సినిమా కంటే ముందే క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సంఘాలను ఒకేసారి చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు శర్వానంద్. అయితే ఎందుకు ఇలా రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నాడు అని మీ అందరికీ డౌట్ రావచ్చు... ఎందుకు అంటే ఒకే ఒక జీవితం సినిమా చేసిన శర్వానంద్ ఈ సినిమాతో మంచి సక్సెస్ అయ్యాడు. కానీ ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత

 వెంటనే తన భార్య గర్భవతి అవ్వడం.. ఆ తర్వాత తనకి పాప పుట్టడం.. ఇలా ఒకటి రెండు సంవత్సరాల వరకు సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే తన భార్య కోసం ఉండిపోయాడు. అలా తన భార్య వల్ల కెరియర్లో రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు శర్వానంద్. ఇక ఈ రెండు సంవత్సరాల గ్యాప్  అలానే ఉండిపోయింది. ఇందులో భాగంగానే ఆ రెండు సంవత్సరాల గ్యాప్ ఓకే సారీ కవర్ చేయాలి అనుకుంటున్నాడు. అందుకే ఒకేసారి రెండు సినిమాలను లైన్లో పెట్టి రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నాడు. అలా కెరియర్లో మొదటిసారి సినిమాల కోసం ఎంత పెద్ద రిస్క్ చేస్తున్నాడు శర్వానంద్. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతుంది. మరి ఒకేసారి రెండు సినిమాలతో వస్తున్న శర్వానంద్ ఎటువంటి హిట్ అనుకుంటాడో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: