సినిమాల కంటే ఓటీటీ లోనే మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఎక్కువ... నివేతా..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటి మనులలో నివేత పేత్రాజ్ ఒకరు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. అలాగే ఈ బ్యూటీ సినిమాలలో తన అందాలను కూడా ఆరబోయడానికి పెద్దగా వెనకడుగు వేయకుండా తన అందాల ఆరబోతతో కూడా కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇకపోతే ఈ బ్యూటీ ఆఖరుగా విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన దాస్ కా దమ్కి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పరువు అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది.

ఈ వెబ్ సిరీస్ రేపు అనగా జూన్ 14 వ తేదీ నుండి జీ 5 ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దానితో ఈ ముద్దుగుమ్మ ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ బ్యూటీ అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా నివేతా మాట్లాడుతూ ... నిజాయితీగా చెప్పాలి అంటే సినిమాల కంటే కూడా మహిళా పాత్రలకు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోనే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

మీలోని ఆర్టిస్టు పూర్తిగా సంతృప్తి పరచుకునే అవకాశం ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోనే దొరుకుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ తో నేను కూడా 100% సంతృప్తి పొందాను అని ఈమె చెప్పుకొచ్చింది. ప్రముఖ దర్శకుడు పవన్ సాదినేని ఈ షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ పై సుష్మిత కొణిదెల ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. నాగబాబు , నరేష్ అగస్త్య , ప్రణీతా పట్నాయక్ ఈ వెబ్ సీరీస్ లో పాత్రలు పోషించారు. సిద్ధార్థ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ పరువు సిరీస్ తమిళ్ లో కూడా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

np

సంబంధిత వార్తలు: