ఆ రెండు సినిమాలు చేయకుండా ఉండాల్సింది... అదా శర్మ..!

Anilkumar
"1920" సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అదా శర్మ. తన యాక్టింగ్, ఎక్స్ప్రెషన్స్, అందంతో తను నటించిన మొట్టమొదటి సినిమా తోనే మంచి హిట్ ను  తన ఖాతాలో వేసుకుంది. దాని తర్వాత వరుస సినిమాలు చేసే అవకాశాన్ని అందుకుంది. తను చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ కూడా ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇది కాసేపు పక్కన పెడితే.. హీరోయిన్లను వాళ్ల లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తున్నారు అని

 అనుకుంటారు అందరూ. కానీ వాళ్లు ఒక సినిమా కోసం ఎంతగా కష్టపడతారు అనేది ఎవరు ఆలోచించరు.  వాళ్ళు ఒక సినిమా కోసం చేసే మేకోవర్ వల్ల వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారో ఎవరు ఊహించలేరు.  దాన్ని ఊహిస్తే షాక్ అవ్వకుండా ఎవరూ ఉండలేరు..! ఆ అనారోగ్యం సమస్య  వల్ల టాలెంటెడ్ హీరోయిన్ అదా శర్మ చాలా బాధపడుతోంది. అయితే తాజాగా అదా శర్మ ఇలా చెప్పుకొచ్చింది... "ది కేరళ స్టోరీ, బస్తర్ సినిమాల కారణంగా ఈ సమస్యల్లో ఇరుక్కున్నాను. నేను ఈ సినిమాల కోసం బరువు తగ్గడం అలానే

 పెరగడంతో నాకు ఈ "ఎండోమెట్రియోసిస్" అనే అరుదైన వ్యాధి వచ్చింది. ఇక నేను ఈ వ్యాధి వల్ల చాలా ఇబ్బందులను ఎదురుకుంటునను. ఈ వ్యాధిలో పీరియడ్స్ నాన్ స్టాప్ గా కొనసాగుతూనే ఉంటాయి దాదాపుగా 48 రోజుల పాటు పీరియడ్స్ అవుతుందని" తాజాగా ఓ ఇంటర్వ్యూలో  తన బాధను వ్యక్తం చేసింది అదా శర్మ . తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా అదా శర్మ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఇది విన్న అభిమానులు కాస్త నిరాశ చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: