ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ : దేవర నుంచి కొత్త అప్డేట్..!

Anilkumar
"నిన్ను చూడాలని" సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. తను నటించిన మొట్టమొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా రెండవ సినిమా "స్టూడెంట్ నెంబర్ 1" తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ఇకపోతే గతేడాది  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఈ

 సినిమా తర్వాత "దేవర" సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతుంది ఈ సినిమా. ప్రపంచ స్థాయిలో బజ్  క్రియేట్ చేస్తున్న చిత్రం ఇది. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్    కీలక పాత్రలో నటించనున్నారు. ఇకపోతే ఈ సినిమా

 రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇదిలా వుంటే దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ ను ముందుగా ఏప్రిల్ 5కి ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ గాయపడటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అందువల్ల మేకర్స్  ఈ సినిమా రిలీజ్ డేట్ ను అక్టోబర్ 10 కి వాయిదా వేశారు.  అయితే ఈ రూమర్స్ అన్నిటికి మేకర్స్ చెక్ పెట్టి దేవర సినిమా రిలీజ్ డేట్ పై త్వరలోనే  క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ వంటి భాషలలో  ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: