షాక్: హీరో దర్శన్ కు ఉరిశిక్ష వేయండి.. సంచలనం రేపుతున్న హీరోయిన్ పోస్ట్..!

Divya
కోలీవుడ్ ఇండస్ట్రీలో గత రెండు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు హీరో దర్శన్.. ముఖ్యంగా నటి పవిత్ర గౌడతో కలిసి రిలేషన్షిప్లో గత పదేళ్ల నుంచి ఉన్నారని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అయితే ఈ నటి విషయంలో కామెంట్స్ చేశారని రేణుక స్వామి అనే వ్యక్తిని హింసించి చంపాడని దర్శన్ పైన కేసు కూడా ఫైల్ కావడం జరిగింది. దర్శన్ తో పాటు మరో తొమ్మిది మందికి కూడా ఈ హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్నట్లు పోలీసులు అరెస్టు చేశారు.

అయితే పవిత్రాన్ని కూడా ఇందులో నిందితులుగా చేసినట్లు సమాచారం.హత్య కేసులో ఐపిసి 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్షగాని జీవిత ఖైది కానీ విదించాలంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.. అయితే ఇప్పుడు కన్నడ నటి మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందిస్తూ రి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నప్పటికీ ఈ కేసు విషయంలో ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. కానీ రమ్య మాత్రం ఆ నెటిజన్ ట్వీట్ ని షేర్ చేయడంతో ఒక విషయం బయటపడింది.. అదేమిటంటే వీరిద్దరి మధ్య ఉన్న రాజకీయ వైర్యమే అన్నట్లుగా సమాచారం.

గత ఎన్నికలలో రమ్య కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దర్శన్ పనిచేశారని సమాచారం. దీంతో రాజకీయ కక్షతోనే ఇలాంటి ట్వీట్ చేసిందని కొంతమంది భావిస్తున్నారు. మరి కొంతమంది ఇద్దరి మధ్య కన్నడ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి చాలా విభేదాలు ఉన్నాయని ఇప్పుడు ఆ హెత్య కేసు కారణంగా బయటపడుతున్నాయని సమాచారం. ఏది ఏమైనా దర్శన్ హత్య చేసినటువంటి ఈ విషయం పైన చాలా మంది పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి పోలీసులు లోతైన దర్యాప్తు చేసిన తర్వాత మరి ఎంతమంది పేర్లు ఇందులో యాడ్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: