నెటిజన్స్ కోరిక మేరకు ఫైమా సింగర్ గా మారుతుందా..??

murali krishna
పటాస్ ఫైమా గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ లో తన స్కిట్స్ తో నవ్విస్తూ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ ని అందిస్తూ ఉంటుంది.అలాగే ఫైమా ఇన్స్టాగ్రామ్ లో చేసే రీల్స్ ఐతే బీభత్సంగా పేలతా ఉంటాయి.సోషల్ మీడియాలో ఫైమా బాగా వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటి ఫైమా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అంటూ ఫాన్స్ కి అడిగింది. ఇక నెటిజన్స్ అంతా కూడా ఫైమా సింగింగ్ మీదే ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఈ మధ్య ఫైమా తన కార్ లో కొత్త బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ నాయక్ తో వెళ్తూ కొత్త కొత్త సాంగ్స్ ని పాడుతోంది.అలాగే కొత్త కొత్త సాంగ్స్ కి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ కూడా చేస్తూ ఆ రీల్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేస్తోంది. అవి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఫైమాని నెటిజన్స్ సింగర్ గా మారాలి అంటూ కోరుకుంటున్నారు. అలాగే ఢీ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా అని కూడా అడుగుతున్నారు.
"సింగర్ అవ్వు అక్కా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం...నీకు బ్రేక్ ఇస్తాం...సింగర్ ఐతే నీకు ఆస్కార్ అవార్డు వస్తుంది" అని అందరూ ముక్తకంఠంతో కోరుతుంటే ఫైమా మాత్రం చాలా సిగ్గు పడుతూ "ఏ ఊకో...మీ అన్న నా పాట విని హాస్పిటల్ లో పడ్డాడు. ఢీ షోలో వాళ్ళు పిలవాలి కదా" అంటూ ఆన్సర్స్ ఇచ్చింది. ఇంతవరకు ఫైమా జబర్దస్త్ లో బులెట్ భాస్కర్ టీమ్ లో లేడీ కమెడియన్ గా ఎంటర్టైన్ చేసింది. మరి తన ఫాన్స్ కోరిక మేరకు ఇప్పుడు ఆమె ఏమన్నా సింగర్ గా ఇండస్ట్రీలో ట్రై చేస్తుందా..లేదా చూడాలి.జబర్థస్త్ ద్వారా ఫైమ ఫేమస్ అయ్యింది. తన మార్క్ పంచ్ లతో.. ప్రేక్షకులను నవ్వించడంతో.. చాలా తక్కువ టైమ్ లోనే ఆమె బాగా ఫేమస్ అయ్యింది. ఇక జబర్థస్త్ ను వీడియ   బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తరువాత ఇంకా పాపులర్ అయ్యింది ఫైమా. చివరి వారం వరకూ ఉండగలిగి మంచి ఫ్యాకేజ్ ను కూడా తెచ్చుకుంది ఫైమా. అయితే జబర్థస్త్ లో తన లక్ష్యం ఏంటో వివరంగా చెప్పిన ఈ కమెడియన్.. అది నేరవేర్చుకుంది. అది కూడా తన తల్లీ తండ్రుల కోసం చేసింది బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: