"ఇండియన్ 2" లో భారతీయుడు బ్యూటీ..?

Pulgam Srinivas
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా మనిషా కొయిరాల హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం ఇండియన్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. తమిళ్ లో ఇండియన్ అనే టైటిల్ తో విడుదల అయిన ఈ సినిమా తెలుగులో భారతీయుడు అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమా అటు తమిళ్ , ఇటు తెలుగు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా ఇండియన్ 2 అనే సినిమాను శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో గా నటిస్తూ ఉండగా , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ ని లైకా ప్రొడక్షన్ సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భారతీయుడు సినిమాలో హీరోయిన్గా నటించిన మనిషా కొయిరాలా ఇండియన్ 2 మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది అని ఈమె పాత్ర ఈ సినిమాలో హైలైట్ గా ఉండనుంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ లో మనిషా కొయిరాల పాత్ర ఉన్న పెద్దగా ఆశ్చర్యం లేదు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాలో నిజం గానే మనిషా కొయిరాలా ఉందా ..? లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: