ఆ విషయంలో కొరటాల అండ్ కో కి స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టిన ఎన్టీఆర్..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చివరగా ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఈ సినిమా చిత్రకరణ దశలో ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని కొరటాల శివ తో ఓకే చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ వచ్చింది. ఇక అప్పటివరకు వరుస విజయాలతో ఉన్న కొరటాల శివ "ఆచార్య" మూవీ తో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. 

ఇక దానితో ఈయన మరోసారి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కాకూడదు అనే ఉద్దేశంతో దేవర మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను , కథకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. దానితో ఈ మూవీ స్టార్ట్ కావడానికి ఎక్కువ సమయం పట్టింది. స్టార్ట్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్పీడుగానే జరుగుతుంది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగాన్ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఈ సినిమా సంబంధించిన అన్ని పనులు అక్టోబర్ 10 కంటే దాదాపు నెల రోజుల ముందే పూర్తి కావాలి అని , అలా అయితేనే మనం సినిమాను అక్టోబర్ 10 కి ఖచ్చితంగా విడుదల చేయగలుగుతాము అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఎన్టీఆర్ హీరో గా రూపొందుతున్న మూవీ కావడం , దానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జాన్వి కపూర్ హీరో గా , సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: