సామ్ ఇంకెంతకాలం ఇలా అజ్ఞాతంలో.. అసలు ఎక్కడున్నావ్..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. గత కొంతకాలం నుండి మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ఖుషీ సినిమా తర్వాత సినిమాలకి పూర్తిగా గ్యాప్ ఇచ్చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు అసలు సమంత చూద్దామన్నా కూడా ఎక్కడా కనిపించడం లేదు. కనీసం సినిమాలను కూడా అనౌన్స్ చేయడం లేదు. కేవలం సోషల్ మీడియాలోనే యాక్టివ్గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే ఆమె

 లేటెస్ట్ ఫోటోలను చూసిన చాలా మంది అసలు సమంతకు ఏమైంది.. ఎక్కడుంది.. సమంత ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదా.. లేదా ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుందా.. అసలు సమంత ఇంకెన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా ఉంటుంది.. అసలు మయోసైటిస్ తగ్గిందా.. లేదా మళ్ళీ వస్తుందా.. లేదా సమంత ఇద్దరేదైనా వ్యాధులతో బాధపడుతుందా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కానీ సమంత మాత్రం ఈ కామెంట్లకు ఇప్పటివరకు రిప్లై ఇవ్వలేదు. కనీసం ఏ విషయం అన్నదానిపై కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. తాజాగా రెడ్ లైట్ తెరపీ డేట్

 అంటూ ఇన్‌స్టాలో స్టోరీ పోస్ట్ చేసారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సమంత   . అంతే కాదు.. మెడికల్ సెషన్ వివరాలు కూడా పోస్ట్ చేసారు.. దాంతో పాటే అందరూ ఫాలో అవ్వాల్సిన హెల్త్ టిప్స్ కూడా ఇచ్చారు సమంత. తనను ట్రీట్ చేస్తున్న డాక్టర్ ప్రీతి శుక్లాకు కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన తన కాంప్లికేటెడ్ కండీషన్ గురించి తెలుసుకోడానికి డాక్టర్ ప్రీతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. ఈమె మాటలు చూస్తుంటే సమంతకి అనారోగ్య సమస్యలు ఇంకా ఉన్నాయనే విషయం అర్థమవుతుంది. ఇదిలా వుండగా రెండేళ్లుగా కొత్త ప్రాజెక్ట్స్ ఏదీ సైన్ చేయలేదు సమంత. అప్పట్లో ఒప్పుకున్న వాటినన్నింటినీ పూర్తి చేసి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: