ఫుల్ స్పీడ్ గా "థగ్ లైఫ్".. ఇప్పటికే అంత శాతం షూటింగ్ పూర్తి..?

Pulgam Srinivas
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సంవత్సరాల క్రితం మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన నాయకుడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయం అందుకుంది. ఇకపోతే ఈ మూవీ లో కమల్ హాసన్ నటనకు గాను , అదే విధంగా ఈ మూవీని తెరకెక్కించిన విధానానికి మణిరత్నం కు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఈ మూవీ వీరిద్దరి కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది. అంతటి స్థాయి విజయం సాధించిన తర్వాత వీరి కాంబోలో సినిమా రాలేదు. దానితో ఎంతో మంది కమల్ , మణిరత్నం అభిమానులు వీరి కాంబో లో మరో మూవీ వస్తే బాగుండు అని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూసే వారందరి ఎదురు చూపులకు కళ్లెం పడేలా చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబోలో థగ్ లైఫ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది. కాకపోతే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయ్యాక తమిళనాడు రాష్ట్రం లో ఎన్నికలు జరగడంతో కమల్ వాటిపై కొంత కాలం దృష్టి పెట్టాడు. దానితో ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజులు ఆగింది. మళ్లీ తమిళనాడు ఎలక్షన్స్ పూర్తి కాగానే కమల్ తిరిగి ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన 60% షూటింగ్ పూర్తి అయ్యింది అని , మరో మిగిలి ఉన్న 40 శాతం షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. కమల్ , మణిరత్నం కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: