"ఖుషి" కంటే ముందే సందడి చేయనున్న "ది ఫ్యామిలీ స్టార్"..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కొంత కాలం క్రితం ది ఫ్యామిలీ స్టార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించగా , పరశురామ్ పెట్ల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజు ఈ సినిమాను నిర్మించగా ... గోపి సుందర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ మూవీ చాలా తక్కువ కాలంలోనే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  ఓ టి టి లో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఇకపోతే విజయ్ దేవరకొండ ఈ మూవీ కంటే ముందు ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నర్వనా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఈ మూవీ ఆ తర్వాత ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా ఓ టీ టీ ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు బుల్లి తెరపై ప్రచారం కాలేదు. ఈ మూవీ తర్వాత విడుదల అయినటువంటి ది ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం బుల్లి తెరపై ప్రసారం కావడానికి రెడీ అయింది. మరి ఖుషి సినిమా ఎప్పుడు బుల్లి తెరపై ప్రసారం అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd

సంబంధిత వార్తలు: