విజయ్ సేతుపతి "మహారాజా" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన నటించిన చాలా తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి . అలాగే ఈయన కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు . ఈయన మొదటి సారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు .
 

ఈ మూవీ అద్భుతంగా ఉండడం , అందులో ఈయన పాత్ర కూడా సూపర్ గా ఉండటంతో ఈ మూవీ తో ఈయనకు మంచి గుర్తింపు లభించింది . ఆ తర్వాత ఈ నటుడు ఉప్పెన సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి సక్సెస్ ను అందుకుంది . అలాగే ఈ మూవీ లోని విజయ్ సేతుపతి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాతో తెలుగు లో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు మహారాజా అనే మూవీ లో హీరో గా నటించాడు.

ఈ మూవీ తమిళ్ , తెలుగు భాషల్లో జూన్ 14 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను మేకర్స్ పూర్తి చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ చిత్ర బృందం వారు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ తో విజయ్ సేతుపతి ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: