టాలీవుడ్ లేడీ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాదం.. మిస్ యు అంటూ కన్నీరు పెడుతూ పోస్ట్..!

lakhmi saranya
టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా నందిని రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తనకు చాలా దగ్గరైన వారు చనిపోవడంతో ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా ఎమోషనల్ అయింది. " మాకు ఎంతో దగ్గరైనా వ్యక్తిని కోల్పోవడం అంతా సులభం కాదు. నేను పెరిగిన వ్యక్తిని కోల్పోవడం ఇదే మొదటిసారి. నన్ను అక్క అని పిలిచిన మొదటి వ్యక్తి. శాంతి ఎప్పుడూ నాకు తెలిసిన అత్యంత దయగల వ్యక్తి.
ఆమె సున్నితమైన బలం ఆమె వ్యక్తిత్వాన్ని నిర్ణయించాయి. అదే బలంతో చిరునవ్వుతో ఓ పెద్ద యుద్ధమే చేసింది. ఆమె గత నాలుగు నెలలుగా ఎంతో కష్టపడి పోరాడుతుంది. దురదృష్టవసాతు ఈరోజు వీడ్కోలు సమయం వచ్చింది. ఉత్తమ కూతురై, సోదరి, భార్య, తల్లి, స్నేహితురాలు. మేం నిన్ను మిస్ అవుతాం నా ప్రియమైన సోదరి. ఎదురుగా కలిసే వరకు వీడ్కోలు " అంటూ తన పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది నందిని. ప్రజెంట్ నందిని పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా నందునికి గుండె ధైర్యం ఇస్తున్నారు. అదేవిధంగా మరికొందరు హోమ్ శాంతి అని కన్నీరు పెడుతున్న సింబల్స్ ను షేర్ చేస్తున్నారు. ఇక ప్రజెంట్ నందిని ఎటువంటి సినిమాకి డైరెక్షన్ వహించడం లేదు. గతంలో వరుస సినిమాలు చేసిన ఈమె ప్రజెంట్ కాలంలో తన జోరును కొంత తగ్గించింది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు నందు. అటువంటిది ఉన్నట్లుండి ఇటువంటి న్యూస్ షేర్ చేసుకోవడంతో తన ఫాన్స్ కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ బాధ నుంచి నువ్వు బయటపడాలంటే సినిమాలకి డైరెక్షన్ వహించాలని కొంతమంది కోరుతున్నారు. తాజాగా నందిని రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: