రామ్ కి అస్సలు మార్కెట్ లేదు...అయిన అంత ఖర్చు చేశాను... వైవిఎస్ చౌదరి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమంలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో వై వి ఎస్ చౌదరి ఒకరు. ఈయన 1998 వ సంవత్సరం విడుదల అయినటువంటి సీతారాముల కళ్యాణం చూతుము రారండి సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఈయన లాహిరి లాహిరి లాహిరిలో , సీతయ్య , దేవదాసు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇక ఆ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈయన కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు.

ఇకపోతే ఈయన నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. హరికృష్ణ మనవడు అయినటువంటి నందమూరి తారక రామారావు ను హీరో గా వై వి ఎస్ చౌదరి తెలుగు సినీ పరిశ్రమకు చేయబోతున్నాడు. హరికృష్ణ పెద్ద కుమారుడైన జానకి రామ్ కుమారుడే ఈ ఎన్టీఆర్. ఇక నిన్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ దేవదాస్ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఈయన మాట్లాడుతూ... నేను దేవదాస్ సినిమా చేస్తున్న సమయానికి రామ్ కి ఒక్క రూపాయి సెలబులిటీ కూడా లేదు.

కానీ నేను ఆ సినిమా కోసం రిలీజ్ రోజు వరకు నేను 10 కోట్లు ఖర్చు చేశాను. ఆస్తులు అన్ని స్టేక్ లో పెట్టాను. జనవరి 11 వ తేదీన దేవదాస్ సినిమా విడుదల అయింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత సంక్రాంతి సీజన్ లో భాగంగా అనేక సినిమాలు విడుదల అయ్యాయి. వాటి దెబ్బతో నా మూవీ కుదేలు అయింది. నాలుగు వారాలు అసలు థియేటర్లలో జనాలే లేరు. ఆ తర్వాత మూవీ పొంచుకుంది. భారీ కలెక్షన్లు వచ్చాయి. అలా రామ్ కి ఏ మాత్రం మార్కెట్ లేని టైం లో ఆయనతో సినిమా నేను చేశాను అని ఆయన దేవదాస్ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: