ఆ విషయంలో బాలయ్య అభిమానుల్ని డిసప్పాయింట్ చేసిన "ఎన్బికె 109" లేటెస్ట్ గ్లిమ్స్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అఖండ మూవీ కంటే ముందు వరుసగా అపజాయలను ఎదుర్కొన్న బాలకృష్ణ ఎప్పుడు అయితే అఖండ మూవీ తో సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్నాడో ఆ తర్వాత నుండి వరుసగా విజాయలను అందుకుంటూ వస్తున్నాడు . అఖండ మూవీ తర్వాత బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత భగవంత్ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మరోసారి అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వాల్టేర్ వీరయ్య మూవీ తో సూపర్ సాలిడ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న దర్శకుడు బాబి డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ పూర్తి అయింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా నుండి చాలా రోజుల క్రితమే ఓ వీడియోను విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఇక నిన్న బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుండి మరో గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో అవుట్ పుట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంతా అదిరిపోయే రేంజ్ లో ఉన్నప్పటికీ బాలకృష్ణ అంటేనే డైలాగులకు పెట్టింది పేరు. డైలాగులకు రోల్ మోడల్ అయినటువంటి బాలకృష్ణ నటించిన సినిమా నుండి నిన్న విడుదల చేసిన వీడియోలో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడంతో ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. కానీ మిగతా ఆడియన్స్ మాత్రం లేటెస్ట్ గ్లిమ్స్ వీడియో అదిరిపోయే రేంజ్ లో ఉంది అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

nbk

సంబంధిత వార్తలు: