కొత్త డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్..!!

murali krishna
ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ఇప్పుడు జోరు తగ్గింది. వరుస పరాజయాలతో తడబడుతున్నాడు. ఎలాంటి కథలు ఎంపిక చేసుకోవాలనే డైలమాలో ఉన్నాడు రామ్‌. ప్రస్తుతం ఆయన తనకు ఇస్మార్ట్ శంకర్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని అందించిన పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నారు.డబుల్‌ ఇస్మార్ట్ పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభమై చాలా రోజులవుతుంది. ఎప్పుడు రిలీజ్‌ అనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్‌ మరో సినిమాకి సైన్‌ చేశాడట. మహేష్‌ బాబు అనే దర్శకుడితో సినిమా చేయబోతున్నాడట. ఆయన గతంలో అనుష్కశెట్టి, నవీన్‌ పొలిశెట్టి జంటగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాని రూపొందించారు. కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. సినిమా మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు రామ్‌ తో సినిమా చేయబోతున్నారట. రామ్‌కి ఇటీవల కథని నెరేట్‌ చేయగా, పాయింట్‌ బాగా నచ్చిందట. ఇటీవల యాక్షన్‌ సినిమాలు ఎక్కువగా చేసిన రామ్‌.. దాన్నుంచి రిలీఫ్‌ కోసం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడా ఎంటర్‌టైనింగ్‌ మూవీ చేయాలని భావిస్తున్నారట. అందులో భాగంగానే మహేష్‌ బాబుకి ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుందని, సెప్టెంబర్‌ నుంచి ఈ మూవీ పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది.
ఇక రామ్‌ ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌తో డబుల్‌ ఇస్మార్ట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సహజంగా పూరీ జగన్నాథ్‌.. చాలా ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్‌ చేస్తాడు. కానీ ఇప్పుడు ఒక్క సినిమాకి ఏడాదిపైనే అవుతుంది. ఇంత డిలేకి కారణమేంటనేది సస్పెన్స్ గా మారింది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు `డబుల్‌ ఇస్మార్ట్`కి బిజినెన్‌ కావడం లేదట. ఓటీటీ కూడా అయ్యే పరిస్థితి లేదంటున్నారు. దీని కారణంగానే డిలే అవుతుందని టాక్‌. రామ్‌ సినిమా డిజప్పాయింట్‌ చేయడం, పూరీ సినిమాలు మిస్‌ ఫైర్‌ అవుతున్న నేపథ్యంలో అది ఆయన సినిమాల బిజినెస్‌పై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే రామ్‌ పోతినేని.. హరీష్‌ శంకర్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా సెట్‌ అయ్యిందని, ముందుగా ఇది సెట్స్ పైకి వెళ్లనుందని గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సడెన్‌గా మహేష్‌ బాబు సినిమాని రామ్‌ ఓకే చేశాడనే వార్త ఆసక్తికరంగా మారింది. మరి ఏది ముందుగా పట్టాలెక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: