ఫుల్ స్పీడ్ చూపించడానికి రెడీ అవుతున్న బాలయ్య..?

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం భగవంత్ కేసరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్లో 109 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను "ఎన్ బి కే 109" అని వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. చాలా వరకు ఈ మూవీ కి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయింది. కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నికలలో బాలకృష్ణ ఎమ్మెల్యే గా పోటీ చేస్తూ ఉండడంతో కొంత కాలం పాటు సినిమా షూటింగ్ ను పక్కన పెట్టి రాజకీయ పనులతో బిజీ అయ్యారు. దానితో ఈ సినిమా షూటింగ్ కూడా కొంత కాలం నిలిచిపోయింది. ఇక కొన్ని రోజుల క్రితం ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చింది.

అందులో అందులో గెలుపొందారు. ఇప్పటికే ఎన్నికల పనులు అన్ని ముగియడంతో బాలకృష్ణ మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాతో పాటు బాలయ్య అఖండ 2 మూవీ ని కూడా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే బాలకృష్ణ "అఖండ 2" మూవీ ని స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో ఓ వైపు బాబి దర్శకత్వంలో రూపొందే మూవీ ని , మరో వైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ  2 మూవీ ని ఏక కాలంలో బాలకృష్ణ పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా బాలయ్య రెండు సినిమాల షూటింగ్ లను ఏకకాలంలో పూర్తి చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: