"విశ్వం" లో ఆ ఎపిసోడ్... ఆ ఎపిసోడ్ క్లిక్ అయితే వింటేజ్ శ్రీను వైట్ల బ్యాక్ అయినట్లే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న గోపీచంద్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఒకానొక సమయంలో వరుస విజయాలతో ఫుల్ జోష్లో కెరీర్లు ముందుకు సాగిస్తున్న గోపీచంద్ కు ఈ మధ్యకాలంలో సరైన విజయం లేదు.

అలాగే కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగిన శ్రీను వైట్ల కి కూడా సరైన విజయం ఈ మధ్య కాలంలో లేదు. దానితో వీరిద్దరూ కలిసి ఓ భారీ బ్లాక్ బాస్టర్ ను రూపొందించాలి అనే కసితో ప్రస్తుతం పని చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి ఓ చిన్న వీడియోను మేకర్స్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీను వైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత హైలైట్ అయిందో మన అందరికీ తెలిసిందే. దానితో విశ్వం సినిమాలో కూడా అలాంటి ఎపిసోడ్ ను ఒక దాన్ని మేకర్స్ ప్లాన్ చేసినట్లు , అందులో భాగంగా ఇప్పటికే దానిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సూపర్ గా వచ్చినట్లు సమాచారం. ఒక వేళ నిజం గానే ఈ ఎపిసోడ్ కనుక వెంకీ మూవీ ట్రైన్ ఎపిసోడ్ మాదిరి క్లిక్ అయినట్లు అయితే ఈ మూవీ తో ఇటు గోపీచంద్ కి , అటు శ్రీను వైట్ల కి బ్లాక్ బాస్టర్ విజయం కన్ఫామ్ అని జనాలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: