"కాంచన 4" లో టాలీవుడ్ స్టార్ బ్యూటీ..?

Pulgam Srinivas
తమిళ , తెలుగు ఇండస్ట్రీలలో మంచి క్రేజ్ కలిగిన హర్రర్ సిరీస్ మూవీ లలో కాంచన సిరీస్ ఒకటి. ఈ సిరీస్ నుండి ఇప్పటికే చాలా మూవీలు వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ తమిళ తెలుగు ప్రేక్షకుల నుండి లభించింది. రాఘవ లారెన్స్ ఈ సిరీస్ మూవీలలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ నటుడు చాలా సినిమాల్లో నటించాడు కానీ ఈ సిరీస్ మూవీ ల ద్వారా వచ్చినంత క్రేజ్ ఆయనకు ఏ మూవీ ద్వారా కూడా లభించలేదు.

ఇకపోతే చాలా కాలం నుండి "కాంచన 4" సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎంతో మంది ఈ సిరీస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనని కొన్ని రోజుల క్రితమే మేకర్స్ విడుదల చేశారు. "కాంచన 4" సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి మొదలు పెట్టనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూనే ఈ మూవీ కి కథ మరియు దర్శకత్వం రాఘవ లారెన్స్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ హీరో గా నటించబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి అయినటువంటి మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే ఈ సినిమా విషయమై మృణాల్ ఈ మూవీ బృందం వారు సంప్రదించగా , ఈమె కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరి కొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: