అర్జున్ సర్జ ఇంట పెళ్లి సందడి.. పిక్స్ వైరల్..!

Anilkumar
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.  అర్జున్ పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే తాజాగా ఈమె పెళ్లి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలోనే అర్జున్ ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అయ్యింది. అర్జున్ పెద్ద కూతురు పెళ్లి జూన్ చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరగబోతోంది. స్టార్ కమెడియన్ తంబి రామయ్య కొడుకు యంగ్ హీరో ఉమాపతితో అర్జున్ పెద్ద కూతురు వివాహం జరగబోతోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న ఈ దంపతుల వివాహానికి కేవలం ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. ఇందులో భాగంగానే వివాహానికి సంబంధించిన హాల్ది మెహందీ ఫంక్షన్స్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇక వాటికి సంబంధించిన ఫోటోలని సైతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా వచ్చిన ఫోటోలలో అర్జున్ తన కూతురిని ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. అందులో చాలా ఎమోషనల్ కూడా అయినట్లుగా కనిపిస్తోంది. అయితే అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య ఉమాపతి ఇద్దరు ఎంతో కాలంగా ప్రేమించుకున్నారు. కొన్ని ఏళ్లు గా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి అందరిని ఓపించారు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు జూన్ 10న వివాహం చేసుకోబోతున్నారు. గత ఏడాది అక్టోబర్

 లో వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా నిర్వహించారు. అప్పుడు కూడా ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరి వివాహం చెన్నైలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగబోతున్నట్లుగా సమాచారం. ఇకపోతే యాక్షన్ కింగ్ అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఎన్నో సూపర్ డూపర్ సినిమాలను చేసి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న అర్జున్ హీరో గానే కాకుండా సహాయ నటుడిగా విలన్ పాత్రల్లో కూడా కనిపించాడు .అలాగే ఆయన కూతురు ఐశ్వర్య సైతం హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలన్నీ కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ హీరోయిన్గా  మంచి మార్కులే పడ్డాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: