బాలీవుడ్ మూవీలో హీరోగా నటించిన రానా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న రానా గురించి పరిచయం అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ నటుడు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని తన నటనతో మాత్రం ప్రేక్షకులను బాగా అలరించాడు. ఇక రానా కేవలం సినిమాలలో హీరో పాత్రలు మాత్రమే చేయాలి అని అనుకోకుండా ఆ సినిమా కథ , అందులోని తన పాత్ర నచ్చితే ఎలాంటి పాత్ర అయిన చేయడానికి రెడీ అయ్యాడు.


దానితో ఇప్పటికే ఎన్నో భాషల సినిమాలలో , ఎన్నో వెరైటీ పాత్రలలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ నటుడు కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ ద్వారా రానా క్రేజ్ ఇండియా వ్యాప్తంగా సూపర్ గా పెరిగిపోయింది. ఇక ప్రస్తుతం రానా "రానా నాయుడు" సీజన్ 2 లో నటిస్తున్నాడు. ఈ సిరీస్ లో రానా తో పాటు తన బాబాయ్ అయినటువంటి వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

ఇది ఇలా ఉంటే రానా మరికొన్ని రోజుల్లో ఓ బాలీవుడ్ మూవీ లో హీరో గా నటించబోతున్నట్టు తెలుస్తుంది.  బాలీవుడ్ డైరెక్ట‌ర్ అమిత్ రాయ్ త్వ‌ర‌లో పీరియాడిక్ కథతో ఓ మూవీ ని తెరకెక్కించబోతున్నాడు. అందులో రానా కూడా హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది.  షాహిద్ క‌పూర్ ఈ సినిమాలో శివాజీ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ,  ఔరంగ‌జేబ్ పాత్ర‌లో రానా న‌టిస్తాడ‌ట‌. ఈ సినిమాలో ఆయ‌న‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అని బాలీవుడ్ వర్గాలలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. త్వ‌రలోనే స్టార్ కానున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు వాకావో ఫిల్మ్స్ తో క‌లిసి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: