"భజే వాయు వేగం" ఈ వీక్ ఎండ్ తో బయటపడేలానే ఉందే..!

Pulgam Srinivas
కార్తికేయ తాజాగా భజే వాయు వేగం అనే సినిమాలో హీరోగా నటించాడు. మే 31 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.
7 రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.27 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్రప్రదేశ్ లో 1.54 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 7 రోజుల్లో 2.81 కోట్ల షేర్ , 5.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 7 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 48 లక్షల కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో 3.29 కోట్ల షేర్ ... 7 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

ఈ సినిమాకు 3.60 ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , 4 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 71 లక్షల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుంటుందో , లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: