నాకు ఆ జోనర్ సినిమాలంటే చాలా ఇష్టం... విజయ్ సేతుపతి..!

Pulgam Srinivas
తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ వచ్చాడు . ఆ పాత్రల తోనే ఈయన ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తూ రావడంతో ఈయనకు వరుసగా అవకాశాలు పెరిగాయి . అందులో భాగంగా విజయ్ సేతుపతి ఇప్పటి వరకు ఎన్నో వేవిద్యమైన సినిమాలలో హీరో గా నటించాడు.

అలాగే ఎన్నో సినిమాలో విలన్ , ఇతర ముఖ్య పాత్రలలోను నటిస్తూ వచ్చాడు . ఇకపోతే విజయ్ సేతుపతి కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించాడు. కొంత కాలం క్రితం ఈయన చిరంజీవి హీరోగా రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు.

ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే తాజాగా విజయ్ సేతుపతి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా తనకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాజాగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ ... నాకు రొమాంటిక్ ప్రేమ కథ చిత్రాలు అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అలాగే ఈ మధ్య కాలంలో విలన్ అవకాశాలు చాలా వస్తున్నాయి. కానీ నాకు అవి చేయడం ఇష్టం లేదు. అందుకే చాలా ఆఫర్లను ఇప్పటికే రిజెక్ట్ చేశాను అని కూడా తాజా ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా విజయసేతుపతి "మహారాజా" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ఈ నెల 14 వ తేదీన విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: